జిల్లా వ్యాప్తంగా పోలీసుల ‘స్వచ్ఛాంధ్ర’ శ్రమదానం
మదనపల్లి
Police ‘Swachh Andhra’ voluntary labor drive across the district
Madanapalle
శనివారం జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి నెలా మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో, ఎస్పీ కార్యాలయ ప్రాంగణం మరియు పరిసరాలను అధికారులు, సిబ్బంది శ్రమదానంతో శుభ్రం చేశారు. గడ్డపారలు, గుణపాలతో చెత్త, పిచ్చిమొక్కలను తొలగించి, చిన్న గుంతలను పూడ్చివేసి పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ మరియు డీఎస్పీ కార్యాలయాలలోనూ పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు.




