ఎస్.వి. కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘ధాత్రి’ మూవీ టీజర్ రిలీజ్

- Advertisement -

ఎస్.వి. కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘ధాత్రి’ మూవీ టీజర్ రిలీజ్
‘Dhathri’ movie teaser released by S.V. Krishna Reddy.
హారర్, థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ధాత్రి’. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్‌లోని కాన్సెప్ట్, విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయని ప్రశంసించిన ఆయన, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సంజన ఫిలిమ్స్ బ్యానర్‌పై గిరి పయ్యావుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లక్కీ వెంకట్, శ్రావణి, ఆధ్య శర్మ, గిరి పయ్యావుల, జబర్‌దస్త్ జీవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గిరి పయ్యావుల స్వయంగా నిర్మిస్తుండగా, సాయి చరణ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్ర కథ ఆసక్తికరమైన నేపథ్యంలో సాగుతుంది. చిన్నతనంలో అనాథగా మిగిలిపోయిన ఓ బాలికను కాశీలోని కొంతమంది అఘోరాలు పెంచి పెద్ద చేస్తారు. ఆ అనాథ పేరు ‘ధాత్రి’. మరోవైపు ఎన్నో అసాంఘిక కార్యకలాపాలతో ఒక గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న దుష్టశక్తులకు ఎదురు నిలిచిన ధాత్రి… ఆ గ్రామాన్ని ఎలా రక్షించింది? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. హారర్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ సినిమా చిత్రీకరణను కాశీ, వారణాసి, బాపట్ల, హైదరాబాద్, కొమరవల్లి తదితర ప్రాంతాల్లో పూర్తి చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తుండగా, చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాతలు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular