సోషల్ మీడియాలో వైరల్ మారిన ‘బంగారం’ సాంగ్

- Advertisement -

సోషల్ మీడియాలో వైరల్ మారిన ‘బంగారం’ సాంగ్
‘Bangaram’ song goes viral on social media.
బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ చౌదరి జంటగా నటించిన ‘బంగారం’ ఆల్బమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మెలోడీ, విజువల్స్, ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
మొదటి నుంచి చివరి వరకు ఫీల్‌గుడ్ రొమాంటిక్ వైబ్‌తో సాగే ఈ పాటలో డెమాన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా ఉండటంతో ఈ పాటను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదిస్తున్నారు.
ఈ పాటకు అఫ్రోజ్ అలీ సాహిత్యం అందించడంతో పాటు స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. సమీరా భరద్వాజ్  వోకల్స్ పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ముఖ్యంగా రణ్జిత్ రెడ్డి అందించిన మ్యూజిక్ ఈ పాటకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. మెలోడీ, బీట్‌లు, అరేంజ్‌మెంట్ అన్నీ కలిసి పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేశాయి.
మంచి మ్యూజిక్, ఆకట్టుకునే విజువల్స్, ఫ్రెష్ కెమిస్ట్రీతో ‘బంగారం’ సాంగ్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పాట సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో చోటు సంపాదించుకుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డెమన్ పవన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. బిగ్‌బాస్ ద్వారా నాకు ఎంతో ప్రేమ, ఆదరణ లభించింది. ఆ ప్రేమతోనే ఈ పాటను నిర్మించాను. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే సాధ్యమైంది. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా లిరిసిస్ట్, కంపోజర్ అఫ్రోజ్ అలీకి, సింగర్ సమీరా భరద్వాజ్ గారికి థ్యాంక్యూ. చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటను మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం. మీ అందరికీ ఈ పాట నచ్చిందని భావిస్తున్నాను. DP Creations బ్యానర్‌ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అందుకే ఈ సాంగ్‌ను ఇంత గ్రాండ్‌గా లాంచ్ చేశాం. భవిష్యత్తులో డీపీ క్రియేషన్స్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు, బిగ్ స్క్రీన్ చిత్రాలు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాను. దానికి కూడా మీ అందరి ప్రేమ, అభిమానం కావాలి. ఈ సాంగ్‌లో రీతూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ పాట కోసం అన్నీ చాలా బాగా కలిసి వచ్చాయి. మా ఫ్యామిలీ, రిలేటివ్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నాగార్జున గారు ఈ సాంగ్‌ను లాంచ్ చేసి చాలా బాగుందని చెప్పడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఉప్పలపాటి శ్యామలాదేవి గారు ప్రోమో లాంచ్ చేసి లాంచ్ చేసి సపోర్ట్ చేశారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు.
రీతూ చౌదరి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ సాంగ్‌కు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాటలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా డెమన్ పవన్ కోసం ఈ సాంగ్ చేశాను. పవన్ ఎంతో ప్యాషన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. షూటింగ్ మొత్తం చాలా సరదాగా జరిగింది. ఈ ప్రయాణంలో తనూజ, అఖిల్, నిసర్గ నాకు చాలా దగ్గరయ్యారు. వాళ్లందరూ ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్, మ్యూజిక్ టీమ్, టెక్నీషియన్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందుకే ఈ పాట ఇంత అందంగా వచ్చింది. సోషల్ మీడియాలో కూడా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ పాటను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలు ఇలాగే మాపై ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్యూ సో మచ్.
సమీరా భరద్వాజ్ మాట్లాడుతూ: అందరికీ థ్యాంక్యూ. పవన్, రీతూ కలిసి చాలా మంచి పాట చేశారు. ఇది నిజంగా బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట మీద నమ్మకంతో వాళ్లు నిర్మించారు. విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకులు ఈ పాటను ఎంజాయ్ చేస్తారు.”
లిరిసిస్ట్, కంపోజర్, సింగర్ అఫ్రోజ్ అలీ మాట్లాడుతూ: ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. చాలా క్రేజీగా ఈ పాటను రాశాను. మేమంతా ఒక టీమ్‌లా కలిసి ఈ సాంగ్‌ను రూపొందించాం. ఇలాగే మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ: ఈ పాటకు వస్తున్న స్పందన చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ముందుకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.”
డైరెక్టర్ & కొరియోగ్రాఫర్ విజ్జు ముధిరాజ్ మాట్లాడుతూ: పవన్, రీతూ గారికి ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ పాటను ఆదరించి మరింత పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో ఇమ్మాన్యుయేల్, తనూజ, కాజల్, అలాగే బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్, నిసర్గ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular