ఏదులాపురంలో మంత్రి పొంగులేటి మార్నింగ్ వాక్

- Advertisement -

ఏదులాపురంలో మంత్రి పొంగులేటి మార్నింగ్ వాక్
ఖమ్మం

Minister Ponguleti’s morning walk in Yedulapuram
శుక్రవారం  మార్నింగ్ వాక్ లో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, ఇందిరమ్మ కాలనీల్లో  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్,  ఏదులాపురం మునిసిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గోన్నారు.  మున్సిపాలిటీలో కొనసాగుతున్న పార్కుల అభివృద్ధి పనులు, కాలనీల్లో ప్రజా

సమస్యలను స్వయంగా తెలుసుకొని , పరిష్కారానికిమంత్రి  భరోనిచ్చారు.
కొన్ని చోట్ల తాగునీరు సమస్య ఉందని, కరెంట్ తీగల నుండి ప్రమాదం పొంచి ఉన్నాయని, వర్షపు నీటి ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని కాలనీ వాసులు తెలియజేయగా సమస్యలను

యుద్దప్రాధిపతికన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
వర్షపు నీరు నిలిచే లోతట్టు ప్రాంతాల్లో శాశ్వత డ్రైనేజీ నిర్మాణాలు, తుమ్మ చెట్ల తొలగింపు, తాగునీటి సరఫరాను మెరుగుపరచడం వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని అధికారులకు

సూచించారు.  మున్సిపాలిటీలో కొనసాగుతున్న పార్కుల అభివృద్ధి పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ పనుల్లో నాణ్యత

పాటించాలని ఆదేశించారు.
మంత్రి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని కాంక్షించి ఏదులాపురం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు ఈ మంజూరు చేశారు.  గ్రామ పంచాయతీల

కలయికగా ఏర్పడిన ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular