సక్సెస్ బాటలో మెగా ఫ్యామిలీ హీరోలు

- Advertisement -

 సక్సెస్ బాటలో మెగా ఫ్యామిలీ హీరోలు
హైదరాబాద్, ఆగస్టు 7, ( వాయిస్ టుడే )

మెగా ఫ్యామిలీ హీరోలందరు వరుసగా సక్సెస్ ల బయపడుతున్నారు. ఇక అదే రీతిలో వరుణ్ తేజ్ సైతం సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా?
మెగా ఫ్యామిలీ హీరోలందరు వరుసగా సక్సెస్ ల బయపడుతున్నారు. ఇక అదే రీతిలో వరుణ్ తేజ్ సైతం సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…కనకరాజు అనంతపురంలోని ఒక ఏరియాలో భజన బృందాన్ని నడుపుకుంటూ డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే తన అన్న అయిన అవసరాల శ్రీనివాస్ సింగపూర్ లో బిజినెస్ పెట్టడానికి 10 లక్షల రూపాయలు కావాలంటే తన అన్న బిజినెస్ కోసం కనకరాజు వల్ల అమ్మ నాన లను ఒప్పించి సునీల్ దగ్గర వాళ్ల ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఇచ్చి అతన్ని సింగపూర్ కి పంపిస్తాడు… అలాగే కనకరాజు కి కోపం ఎక్కువగా ఉండటం తో సునీల్ వాళ్ల మనిషిని కొడతాడు. సునీల్ తో గొడవ పెట్టుకుంటాడు. అలాగే కనకరాజు రోజు మందు తాగడానికి ఏదో ఒక కారణాన్ని వెతుకుంటాడు. కనకరాజు తన ఫ్రెండ్ సత్య తో కలిసి రోజు వైన్స్ లో మధు తాగుతాడు.ఒక రోజు బార్ లో ఫైట్ జరుగుతున్నప్పుడు ఒక కొరియన్ గ్యాంగ్ స్టర్ అస్థికలు ఉన్న బాటిల్ లో కనకరాజు మందు కలుపుకొని తాగుతాడు. దాంతో అప్పటి నుంచి ఆ కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ కనకరాజు బాడిలోకి వస్తుంది… దీనివల్ల కనకరాజు కి తెలియకుండానే చాలా దారుణాలు చేస్తుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కనకరాజు బాడీ నుంచి ఆ ఆత్మ ను ఎలా వేరు చేశారు. కనకరాజు వాళ్ల అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటి నుంచి కథను ఎంటర్ టైన్ మెంట్ వే లోనే తీసుకెళ్లాడు. ఒక ఆత్మ ద్వారా కనకరాజు కొరియన్ కనకరాజు ఎలా అయ్యాడు అనే పాయింట్ పేపర్ మీద ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గానే అనిపించినప్పటికి దానిని స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయలేకపోయాడు… చాలా వరకు ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా సాగింది. ఇక సెకండాఫ్ అయితే ఎప్పుడై పోతుందా అనిపించింది. నిజానికి సత్య కామెడీ మధ్యలో కొంచెం రిలాక్సేషన్ ఇస్తుందేమో అనుకుంటే అది కూడా ప్రపర్ గా వర్కౌట్ కాలేదు…ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్… అది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఆత్మ లతో ఫైట్ పెట్టారు. ఏంటబ్బా ఈ రోజుల్లో కూడా అలాంటి సిల్లీ ఫైట్స్…అయిన కాన్సెప్ట్ ప్రకారం ఆత్మ రావడం ఏంటి అవి ఫైట్స్ చేసుకోవడం ఏంటి? కనకరాజు చనిపోయాక మళ్ళీ బతకడం ఏంటి? ఇవన్నీ చాలా ఆర్టిఫీషియల్ గా ఏదో జరగాలి. కాబట్టి జరుగుతుంది అంతే తప్ప పెర్ఫెక్ట్ లాజికల్ గా మాత్రం వర్కౌట్ చేయలేదు… చాలా రొటీన్ టెంప్లేట్ లో సినిమా సాగింది. ఎంటైర్ సినిమాలో హైలెట్ సీన్స్ ఏమున్నాయి అని ఆలోచిస్తే ఒక్కటి కూడా దొరకడం లేదు…చాలా పూర్ రైటింగ్ ఉంది. మ్యూజిక్ ఒకే అనిపించింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంటర్వెల్ సీన్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించేలా ఉంది…సెకండాఫ్ లో ఆ కొరియన్ దయ్యం గాడు రావడమేంటి వాడు చేసే రచ్చ రచ్చ ను మనమెందుకు భరించాలి అనేంత చిరాకు పుడుతుంది..
ఇక హీరోయిన్ పాత్ర కి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఏమీ లేదు. ఏదో సినిమాలో ఉంది కదా అంటే ఉంది అంతే తప్ప పర్టికులర్గా సినిమా ఎప్పుడు కూడా డిపెండ్ అయి ముందుకు సాగలేదు… కామెడీ సన్నివేశాలు సిచువేషన్ కి తగ్గట్టుగా అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్…
ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కా విలేజ్ కుర్రాడిలా కనిపించడానికి చాలా బాగా కష్టపడ్డాడు. అలాగే కొరియన్ వ్యక్తి ఆత్మ కనకరాజు బాడీ లోకి వచ్చినప్పుడు వరుణ్ తేజ్ యాక్టింగ్ చాలా బాగుంది… అలాగే సత్య గురించి చెప్పాలి అంటే ఆయన పెర్ఫెక్ట్ తన కామెడీ టైమింగ్ ను ఫాలో అవుతూ చాలా మంచి కామెడీ చేశాడు… మిగతా ఆర్టిస్టులందరు తమ పాత్ర పరిధి మేరకు ఒకే అన్నారు…
టెక్నికల్ అంశాలు…
సినిమాలో విజువల్స్ కొన్ని బాగున్నాయి… బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది…సాంగ్స్ విషయంలో ఇంకొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటే బాగుండేది…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…ఎడిటింగ్ వర్క్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది… ఈ మూవీలో అంత పెద్ద లెంత్ ఉన్న సీన్స్ అవసరం లేదు… వాటిని ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది…
ప్లస్ పాయింట్స్…
వరుణ్ తేజ్ యాక్టింగ్
సత్య కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ ఆత్మ కథ
సెకండాఫ్ టోటల్ గా డల్ అయింది…
క్లైమాక్స్ లో అదంతా అవసరం లేదు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular