సమాచార భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

- Advertisement -

సమాచార భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

 

శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు.. భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ

హైదరాబాద్, ఆగస్టు 7 (వాయిస్ టుడే): సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్ (ఎఫ్‌డీసీ కాంప్లెక్స్) కార్యాలయ ప్రాంగణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా సాగాయి.

ఉత్సవాల సందర్భంగా బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు, అమ్మవారి ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

అనంతరం జరిగిన ఉత్సవ ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, తెలంగాణ సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను అలరించాయి. ఉద్యోగులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సంచాలకులు ఎల్.ఎల్.ఆర్. కిషోర్ బాబు, అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్లు డి. శ్రీనివాస్, కె. వెంకటరమణ, సి.ఐ.ఈ. రాధాకిషన్, డిప్యూటీ డైరెక్టర్లు సి. రాజారెడ్డి, ఆర్.ఐ.ఈ. జయ రామ్మూర్తి, సహాయ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి, బిమల్ దేవ్, డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ నర్సింహా గౌడ్, అకౌంట్స్ ఆఫీసర్లు పద్మ, టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు యేలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవోస్ నాయకులు అనిల్, జితేందర్, దుర్గాప్రసాద్‌తో పాటు శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular