తిరుమల శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు చెక్

- Advertisement -

తిరుమల శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు చెక్
తిరుమల, ఆగస్టు 14

Check for accommodation difficulties of Tirumala Srivari devotees
తిరుమల శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు చెక్ పెడుతూ టీటీడీ కొత్తగా నిర్మించిన రెండు వసతి సముదాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతిలో భక్తుల కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలను బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రెండు వసతి సముదాయాలలో దాదాపు 10,000 మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. మొత్తం వెయ్యికిపైగా గదులు అందుబాటులోకి రానున్నాయి.. తిరుమలలో 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు, 5 పీఏసీలు ఉన్నాయి. తిరుమలలో ప్రస్తుతం ఉన్న వసతి గదులు భక్తులకు సరిపోవడం లేదు.. అలాగని కొత్తగా అక్కడ సముదాయాలు నిర్మించలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ తిరుమలలో వసతి గదులు దొరకకపోతే భక్తుల కోసం తిరుపతిలో శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, పద్మావతి అతిథి గృహం ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో వసతి గదులు సరిపోవడం లేదు.. ఈ సమస్యకు చెక్ పెట్టేలా కొత్తగా నిర్మించిన మరో రెండు వసతి సముదాయాలు అందుబాటులోకి రాబోతున్నారు.తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాల పనులు ముగింపు దశకు వచ్చాయి. ప్రధాన భవనాలు, గదుల నిర్మాణం పూర్తికాగా.. విద్యుత్, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో జరగబోయే బ్రహ్మోత్సవాల సమయంలో వీటిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలను దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో, అధునాతన వసతులతో నిర్మిస్తున్నారు. ఈ శ్రీపాదం, అచ్యుత భవనాలు తొమ్మిది అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో 532 గదులు చొప్పున మొత్తం 1064 గదులు ఉంటాయి.. ఈ రెండు సముదాయాలలో కలిపి 10వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు.అచ్యుతం, శ్రీపాదం వసతి సముదాయాల్లోని భవనాల్లో రిసెప్షన్, అన్నదానం, డార్మెటరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.. దాదాపు 7వేల మంది భక్తులకు సరిపోయేలా లాకర్ల సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. ఈ రెండు వసతి సముదాయాల నిర్మించాలని 2022లో అప్పటి టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. కానీ నిర్మాణ పనులు 2024 మార్చిలో ప్రారంభంకాగా.. 2026 ఏప్రిల్‌కు పూర్తి చేయాలని భావించారు. కానీ పనులు కాస్త ఆలస్యం కావడంతో బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular