కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్
Announcement of Kamal Haasan’s highly anticipated project
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కొత్త సినిమా ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఆర్కేఎఫ్ఐ (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్), టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మించనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమా వరల్డ్‌పై ఆసక్తిని పెంచుతోంది.
ఈ పోస్టర్లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గడ్డంతో, బ్లాక్ షర్ట్, ఆలివ్ గ్రీన్ ట్రౌజర్స్‌లో కనిపిస్తున్నారు. పవర్‌ఫుల్‌గా కనిపించే లుక్కు చేతిలో పట్టుకున్నఆయుధం మరింత ఇంటెన్స్నెస్ తీసుకొచ్చింది. ఎంతో కూల్‌గా కనిపిస్తూనే, భారీ ఆయుధంతో నడుస్తున్న కమల్ హాసన్ లుక్.. ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తోంది.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లుక్ టెస్ట్‌ను నిన్న నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
‘సేతుపతి’, ‘చిత్తా’ వంటి సినిమాలతో ఎస్.యు. అరుణ్ కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బలమైన పాత్రలను ఆసక్తికరమైన కథనంతో మిళితం చేయడంలో పేరుపొందారు. ఆయన కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం ఈ కొత్త ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తవడంతో సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్, సినిమా టైటిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: కమల్ హాసన్
కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్

- Advertisement -
- Advertisement -



