ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన కీసర సీఐ, ఎస్సై

- Advertisement -

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన కీసర సీఐ, ఎస్సై
మేడ్చల్

Keesara CI and SI caught by ACB while accepting a bribe of ₹5 lakh.
బుధవారం రాత్రి కీసర చెరువు దగ్గర ఛేజింగ్ జరిగింది.  ఎస్సై పరుగులు తీస్తుండగా ఏసీబీ టీం వెంటపడింది. సినీమా ఫక్కిలో సీన్ జరిగింది. ఎమైయిందో అంటు  స్థానికులు  ఆశ్చర్యపోయారు కీసర ఎస్ఐ, సీఐ .  ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి డిమాండ్ చేసారు.  కీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు లంచం తీసుకుంటుండగా వచ్చిన ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి పరుగులు తీసాడు. ఏసీబీ ఛేజింగ్ చేసి పట్టుకుంది.   కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ అంజనేయులు ముప్పు తిప్పలు పెట్టారు.  రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసి నిందితులతో ఇన్స్పెక్టర్ అంజనేయులు పని చేయించుకుంటున్నాడు.  కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్డ్రింక్స్ తీసుకురావాలని సీఐ వేధింపులకు గురిచేయడంతో బాధితులు  వేధింపులు తట్టుకోలేక ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. చిరవకు సర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో వున్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular