Toddler dies of suffocation in car
కారులో ఊపిరాడక చిన్నారి మృతి
భద్రాద్రి కొత్తగూడెం
ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కారు లాక్ అవ్వడంతో ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సర్పంచ్ నవీన్, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు పిల్లలు తన్వితశ్రీ (4), సురక్ష. ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో, ఇంటి వద్ద ఆడుకుంటూ లాక్ చేయని కారులో తన్వితశ్రీ ఎక్కింది. కారు ఎక్కగానే కారు లాక్ అవ్వడంతో, కాసేపటికి ఊపిరాడక చిన్నారి స్పృహ తప్పింది. కాసేపటికి కూతురు కనిపించడంలేదని తల్లి చెప్పడంతో ఊరంతా వెతికి, అనుమానంతో కారులో చూడగా స్పృహ తప్పి పడిపోయిన తన్వితశ్రీని గుర్తించి స్థానికులు బయటికి తీసారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.




