మార్తాండ నగర్ మహా గణనాథుని దర్శించుకున్న మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

- Advertisement -

మార్తాండ నగర్ మహా గణనాథుని దర్శించుకున్న మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

Munnuru Kapu Corporation Chairman Bomma Sriram Chakravarthy visited the Maha Gananatha at Marthanda Nagar.

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహా గణనాథునికి ప్రత్యేక పూజలు

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (వాయిస్ టుడే): న్యూ హఫీజ్‌పేట్ మార్తాండ నగర్‌లో గత 20 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరుతున్న మహా గణనాథుడిని మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రజ హోటల్స్, పరంపర స్వీట్స్ అధినేత తుడి ప్రవీణ్ కూడా మహా గణనాథుడిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ.. మహా గణనాథుని దివ్య ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని గణనాథుని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రజల సంక్షేమం, శాంతి, సౌభాగ్యం కోసం మహా గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, హఫీజ్‌పేట్ మున్నూరు కాపు సోదరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular