డైరెక్టర్ విజన్ ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం నా అదృష్టం – డైరెక్టర్ నాగ్ అశ్విన్
“It is my good fortune to find a star like Prabhas who trusts the director’s vision.” – Director Nag Ashwin
రెబెల్ స్టార్ ప్రభాస్ తో కల్కి 2898ఎడి సినిమా రూపొందించి బాక్సాఫీస్ సక్సెస్ తో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకున్న నాగ్ అశ్విన్..డైరెక్టర్ విజన్ ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం తన అదృష్టమని తెలిపారు. అక్టోబర్ నుంచి కల్కి సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది జూన్ కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నామని నాగ్ అశ్విన్ చెప్పారు. ఈ సారి భారీ స్కేల్ లో తొలి చిత్రానికి మించిన ఎమోషన్స్ తో కల్కి 2 ఉంటుందని ఆయన వెల్లడించారు.
2024లో రిలీజైన కల్కి 2898ఎడి మూవీ ప్రభాస్ కు మరో భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రంలో భైరవ, కర్ణ పాత్రల్లో ప్రభాస్ ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని అలరించారు. కల్కి 2 సీక్వెల్ కోసం వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్..త్వరలోనే కల్కి 2 సెట్స్ లోనూ జాయిన్ కానున్నారు.




