ఆటోలో మరిచిపోయిన రూ.60 వేల నగదు బ్యాగ్‌ రికవరీ

- Advertisement -

ఆటోలో మరిచిపోయిన రూ.60 వేల నగదు బ్యాగ్‌ రికవరీ

Bag containing ₹60,000 in cash left behind in auto-rickshaw recovered

రాయదుర్గం, సెప్టెంబర్ 30 ( వాయిస్ టుడే): ఆటోలో మరిచిపోయిన రూ.60,000 నగదును రాయదుర్గం పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన జిడ్డు బాయలు ఆవులను తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి తాత్కాలికంగా నివసిస్తూ, గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆవులను తిప్పుతూ జీవనం సాగిస్తున్నారు. సెప్టెంబర్ 29న మధ్యాహ్నం స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో తన వద్ద ఉన్న రూ.60,000 నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మరిచిపోయారు. విషయం గుర్తించిన అనంతరం ఆయన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై వెంటనే స్పందించిన రాయదుర్గం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, బాధితుడు ప్రయాణించిన ఆటోను గుర్తించారు. ఆటోను గుర్తించి తనిఖీ చేయగా రూ.60,000 నగదు ఉన్న బ్యాగ్‌ లభించింది. పోలీసులు నగదును రికవరీ చేసి బుధవారం బాధితుడికి తిరిగి అప్పగించారు.
తన పోగొట్టుకున్న నగదును త్వరగా గుర్తించి తిరిగి అందించిన రాయదుర్గం పోలీసులకు జిడ్డు బాయలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular