లింగంపల్లి వద్ద 23 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
23 kg of ganja seized at Lingampally; two arrested.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (వాయిస్ టుడే): లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద 23 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు లింగంపల్లి స్టేషన్ వద్ద రూట్ వాచ్ నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తుల బ్యాగులను తనిఖీ చేయగా 23 కిలోల గంజాయి లభించింది. పోలీసుల విచారణలో నిందితులు ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్, రషీద్‌గా గుర్తించారు. వీరు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. ఈ కేసును టాస్క్ ఫోర్స్ సీఐ వాసుదేవరావు, ఎస్ఐ ధనరాజ్ మరియు సిబ్బంది ఛేదించినట్లు అధికారులు తెలిపారు.




