Journalists must launch a movement inspired by the fighting spirit of Komaram Bheem
- TUWJ State President K. Virahat Ali
- Advertisement -
కొమురం భీం పోరాట స్ఫూర్తితో జర్నలిస్టులు ఉద్యమించాలి
-TUWJ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ
Journalists must launch a movement inspired by the fighting spirit of Komaram Bheem
– TUWJ State President K. Virahat Ali
Journalists must launch a movement inspired by the fighting spirit of Komaram Bheem – TUWJ State President K. Virahat Ali
జోడేఘాట్ సాక్షిగా, జల్…జంగల్…జమీన్ తమ హక్కుగా గర్జించి,అణచివేతకు ఎదురు నిలిచి, అన్యాయానికి తలవంచకుండా, ఆదివాసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం ఎదురొడ్డి పోరాడిన వీరుడు కొమురం భీం పోరాట స్ఫూర్తితో జర్నలిస్టులు హక్కుల సాధనకై ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ పిలుపు నిచ్చారు.
బుధవారం నాడు టీయూడబ్ల్యూజే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తృతీయ మహాసభ, ఆసిఫాబాద్ పట్టణంలోని రోజ్ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో, కొమురం భీం ప్రాంగణంలో జరిగింది. ఈ సభకు ఆయన విశిష్ట అథితిగా హాజరై ప్రసంగించారు.
ఆసిఫాబాద్ అంటే అడవి మాత్రమే కాదని, ఆదివాసీ బిడ్డల ఆత్మగౌరవానికి అది చిరునామా అని విరాహత్ అభివర్ణించారు. ఆసిఫాబాద్ ఒక జిల్లా మాత్రమే కాదని, కొమురం భీం పోరాట వారసత్వాన్ని మోస్తున్న నేల అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు, త్యాగాలు, విజయాలతో కూడిన సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న ఏకైక సంఘం టీయూడబ్ల్యూజే మాత్రమేనని ఆయన స్పష్టం చేసారు. జర్నలిస్టుల గొంతుకగా, 75ఏళ్ల నుండి మడమ తిప్పని పోరాటాలు చేస్తున్న గొప్ప చరిత్ర తమ సంఘానికి ఉందని, తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలు తమ సంఘం సాధించినవేనని ఆయన స్పష్టం చేసారు. నాటి నుండి నేటి వరకు తమ సంఘం ఏ రాజకీయ పార్టీకో, ప్రభుత్వానికో అనుబంధంగా పనిచేయలేదని,
జర్నలిస్టుల, మీడియా పక్షపాతిగా నిలబడి రాజీలేని పోరాటాలు కొనసాగిస్తున్నట్లు విరాహత్ అలీ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించడం సరైంది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్ అమలుకాక పోవడంతో అప్పులు చేసి చికిత్స పొందుతున్నారని, మరి కొందరు అప్పులు చేసే స్థోమత లేక అనారోగ్యాలతో తనువు చాలిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. అలాగే ఇండ్లు, ఇంటి స్థలాల హామీని ప్రభుత్వం నేటికీ అమలు చేయకపోవడంతో జర్నలిస్టుల్లో తీవ్ర నిరాశ నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కరానికి కృషి చేయాలని విరాహత్ అలీ కోరారు. గౌరవ అథితిగా హాజరైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ మాట్లాడుతూ, ట్రేడ్ యూనియన్ నియమావళికి అనుగుణంగా సంస్థాగత నిర్మాణంతో రాష్ట్రంలో కొనసాగుతున్న ఏకైక జర్నలిస్టుల సంఘం తమదేనని ఆయన పేర్కొన్నారు. 33జిల్లాల్లో వేలాది జర్నలిస్టుల సభ్యత్వాలతో తమ సంఘం శాఖలు బలోపేతంగా పనిచేస్తున్నట్లు రాంనారాయణ స్పష్టం చేసారు. జర్నలిస్టుల సంక్షేమం తప్పా, వేరే వ్యామోహలు తమకు లేవని ఆయన అన్నారు. ఇంకా ఈ సభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్ రెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ రహ్మాన్, సంపత్, యూనియన్ జిల్లా నాయకులు కృష్ణం రాజు, ప్రకాష్ గౌడ్, జమీల్, గిరిజా బాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి దాదాపు 250మంది జర్నలిస్టులు మహాసభకు హాజరవ్వడం విశేషం.
కథనాల్లో వాస్తవాలు ఉండాలి
-జిల్లా కలెక్టర్ హరిత
ప్రజా సమస్యలపై జర్నలిస్టులు రాసే కథనాల్లో వాస్తవాలు ఉంటేనే అవి విశ్వాసం పొందగలుగుతాయని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. టీయూడబ్ల్యూజే మహాసభకు ఆమె ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. ప్రజా క్షేత్రంలో అధికార యంత్రాంగంతో కలిసి జర్నలిస్టులు టీమ్ వర్క్ చేస్తే సత్పలితాలు సాధించే అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.