హైడ్రా పేరుతో వ‌సూళ్ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు

- Advertisement -

హైడ్రా పేరుతో వ‌సూళ్ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు

ఏసీబీ, హైడ్రా, పోలీసు స్టేష‌న్లో ఫిర్యాదు చేయాల‌న్న హైడ్రా
Strict action will be taken against those who resort to extortion using the name of HYDRAA.

హైద‌రాబాద్‌, అక్టోబ‌రు 09:

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే వెంట‌నే ఫిర్యాదు చేయాల‌ని శుక్ర‌వారం హైడ్రా ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరింది. ఏసీబీ(యాంటీ క‌ర‌ప్ష‌న్ బ్యూరో) లేదా స్థానిక పోలీసు స్టేష‌న్లో కూడా ఫిర్యాదు చేయాల‌ని సూచించింది. అక్ర‌మ క‌ట్ట‌డాలు, అనుమ‌తి లేని నిర్మాణాల‌పై హైడ్రా ఎక్క‌డా నేరుగా చ‌ర్య‌లు తీసుకోద‌ని స్ప‌ష్టం చేసింది. జీహెచ్‌ ఎంసీ,  సీఎంసీ, ఎంఎంసీల విజ్ఞ‌ప్తి మేర‌కే ప్ర‌మాద‌క‌ర‌మైన భ‌వ‌నాల‌ను హైడ్రా తొల‌గిస్తోంద‌ని పేర్కొంది. హైడ్రా పేరుతో బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం.. ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి డ‌బ్బులు గుంజిన‌ట్టు సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌లు, త‌మ‌కు నేరుగా వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా ఈ ప్ర‌క‌ట‌న చేసింది. కూలిపోయే స్థితిలో ఉండి.. ప్ర‌జ‌ల‌ ప్రాణాల‌కు ముప్పుగా ప‌రిణ‌మించే భ‌వ‌నాల‌పై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇలాంటి భ‌వ‌నాల్లో హాస్ట‌ళ్లు నిర్వ‌హించ‌రాద‌ని ఇప్ప‌టికే హిత‌వు ప‌లికింది. సుర‌క్షిత‌మైన భ‌వ‌నాల్లోకి హాస్ట‌ళ్లు మార్చాల‌ని సూచించింది. ఇందుకుగాను డిసెంబ‌రు 31వ తేదీ వ‌ర‌కూ గ‌డువు ఇచ్చిన విష‌యాన్ని హైడ్రా ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది. హైడ్రా పేరు చెప్పి డ‌బ్బులు దండుకునే వారిపై నేరుగా హైడ్రా, ఏసీబీ కార్యాల‌యాల్లో ఫిర్యాదు చేయాల‌ని సూచించింది. అలాగే స్థానిక పోలీసు స్టేష‌న్లో కూడా ఫిర్యాదు చేయాల‌ని పేర్కొంది. హైడ్రా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే వారు చెప్పిన మాటలు నమ్మి ఎలాంటి చెల్లింపులు చేయ‌వ‌ద్ద‌ని సూచించింది.

* ఫిర్యాదు చేయాల్సిన నంబ‌ర్లు:
ఏసీబీ టోల్‌ఫ్రీ నంబ‌రు 1064
హైడ్రా కంట్రోల్ రూం టోల్‌ఫ్రీ నంబ‌రు 1070

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular