ఆచార్య ముదిగొండ శివప్రసాద్  మృతిపట్ల ముఖ్యమంత్రి   ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం

- Advertisement -

ఆచార్య ముదిగొండ శివప్రసాద్  మృతిపట్ల ముఖ్యమంత్రి   ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం
హైదరాబాద్

Chief Minister A. Revanth Reddy expresses deep condolences over the demise of Acharya Mudigonda Siva Prasad.
ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య ముదిగొండ శివప్రసాద్  మృతిపట్ల ముఖ్యమంత్రి   ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సాహిత్య రంగంలో నవలా రచయితగా, చరిత్ర పరిశోధకుడిగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా ఆచార్య ముదిగొండ శివప్రసాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు పాఠకులకు మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించడంలో వారు విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ముదిగొండ శివప్రసాద్  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సాహితీ సహచరులకు ముఖ్యమంత్రి  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular