డైరెక్టర్ నందినీ రెడ్డి లాంచ్ చేసిన ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

- Advertisement -

డైరెక్టర్ నందినీ రెడ్డి లాంచ్ చేసిన ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

First look poster of the movie ‘Destiny’ launched by director Nandini Reddy
కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నందినీ రెడ్డి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’ టైటిల్‌కి తగ్గట్టుగా సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్‌లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారని అర్థం అవుతోంది. టైటిల్‌‌ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
*తారాగణం* : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular