శ్రీ కృష్ణదేవరాయ ట్రస్టుకు సంగానీ రజనీకాంత్ రూ.50 వేల విరాళం
Sangani Rajanikanth donates Rs. 50,000 to the Sri Krishnadevaraya Trust
సూర్యాపేట: శ్రీ కృష్ణదేవరాయ ట్రస్టు జిల్లా కార్యాలయ నిర్మాణం, అభివృద్ధి, సేవా కార్యక్రమాల నిర్వహణకు సంగానీ వెంచర్స్ ఎండీ, ఎన్ఆర్ఐ సంగానీ రజనీకాంత్ రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు ఎలిమినేటి రమేష్తో పాటు శ్రీనివాస్ నాయుడు, డేగల కృష్ణ రజనీకాంత్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సంగానీ రజనీకాంత్ మాట్లాడుతూ, మున్నూరు కాపు సమాజ ఐక్యత, సంక్షేమం, భవిష్యత్ తరాల అభ్యున్నతికి ట్రస్టు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. దాతల సహకారంతో జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.




