జడి’ సినిమా గ్లింప్స్ విడుదల..
‘Jadi’ movie glimpse released..
ఒడియాలో ఘన విజయం సాధించిన ‘జడి (What If)’ చిత్రాన్ని మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాజల్ రే నిర్మించిన ఈ చిత్రానికి దిబ్య జ్యోతి ఉదయ సింగ్ రచన, దర్శకత్వం వహించారు. సైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా ప్రధాన పాత్రల్లో నటించగా.. సుశాంత్ దాస్ మహాపాత్ర, రబి మిశ్రా, బాలకృష్ణ నాయక్, కృష్ణ రౌత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది.
తాజాగా తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కాలేజీ యువకుల మధ్య స్నేహం, అనుబంధాలతో ప్రారంభమై.. ప్రేమకథగా మారుతూ, స్నేహితుల మధ్య తలెత్తే విభేదాలు, సంఘర్షణలను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. ప్రేమకథకు మించి జీవితంలోని విభిన్న భావోద్వేగాలు, బంధాలను ఈ చిత్రం ఆవిష్కరించనుంది.
దర్శకుడు దిబ్య జ్యోతి ఉదయ సింగ్ గ్రామీణ వాతావరణం, యువత స్నేహాలు, ప్రేమ, సంఘర్షణలను సహజంగా తెరపై ఆవిష్కరించారు. రుద్రకాంత సింగ్ సినిమాటోగ్రఫీ గ్రామీణ అందాలను చూపించగా అభిషేక్ పనిగ్రాహి నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కు భావోద్వేగాలను జోడించింది. సోమేశ్ సత్పతి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తెలుగు వెర్షన్‌కు రాకేందు మౌళి పాటలు, మాటలు రాశారు. ఈ చిత్రానికి మనస్ కుమార్ సాహూ ఎడిటర్‌గా వ్యవహరించారు.
తాజాగా విడుదలైన ‘జడి’ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తెలుగు వెర్షన్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
నటీనటులు: సైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా, సుశాంత్ దాస్ మహాపాత్ర, రబి మిశ్రా, బాలకృష్ణ నాయక్, కృష్ణ రౌత్.




