మున్నూరు కాపు సమాజానికి సేవకుడిగా పనిచేస్తా
మున్నూరు కాపు పటేల్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్
మున్నూరు కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలి
కుటుంబ సభ్యత్వ వెబ్సైట్ ఆవిష్కరణలో పిలుపు
I will serve as a servant to the Munnuru Kapu community: Konda Devayya Patel

వరంగల్: మున్నూరు కాపు సమాజ అభ్యున్నతికి, హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ అన్నారు. మున్నూరు కాపు సమాజానికి సేవకుడిగా పనిచేస్తూ, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
మున్నూరు కాపుల జనాభా, కుటుంబాలు, సభ్యుల వివరాలను సమగ్రంగా నమోదు చేసేందుకు రూపొందించిన కుటుంబ సభ్యత్వ వెబ్‌సైట్‌ను వరంగల్‌లోని శాంతినగర్ మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్లో ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముష్కమల్ల సుధాకర్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులంతా వెబ్సైట్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. దీనివల్ల సమాజ జనాభా, కుటుంబాల వివరాలను కచ్చితంగా తెలుసుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు.
మున్నూరు కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలి
రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ మున్నూరు కాపులు వెనుకబడుతున్నారని దేవయ్య పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలగలేదన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినా, తగిన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. సమాజ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మున్నూరు కాపు కార్పొరేషన్‌కు వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐక్యంగా హక్కులు సాధించుకోవాలి
మున్నూరు కాపులంతా ఐక్యంగా ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకుని, తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య పటేల్, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడు గైనని రాజన్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పటేల్, బండి చక్రపాణి పటేల్, మేడిది మధుసూదన్ పటేల్, వలిశెట్టి అనిల్ పటేల్, బోరిగం భాస్కర్ పటేల్, కంచి మనోహర్ పటేల్, లక్కాకుల శ్యామ్ పటేల్, పెరికారి శ్రీధర్ పటేల్, మాడిశెట్టి వరుణ్ పటేల్, దద్దనాల రమేష్ పటేల్, కందుల శ్రీధర్ పటేల్, తోట కృష్ణమూర్తి పటేల్, ముష్కమల్ల దేవేందర్ పటేల్, వనం శ్యామ్ పటేల్, బండి సుధాకర్ పటేల్, దొరం ఆనంద్ పటేల్, గాదె నర్సింగం పటేల్, పూజారి మోహన్ పటేల్, గజ్జల ఉపేందర్ పటేల్, గాజే పవన్ పటేల్, శ్రీరాముల వీరన్న పటేల్, పోడిశెట్టి సతీష్ పటేల్, కోలా రాజేష్ పటేల్, పల్లం రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.




