జీఓ నెం.14ను రద్దు చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- Advertisement -

ఆత్మగౌరవ భవనాలపై కుల సంఘాల ట్రస్టులకే పూర్తి అధికారాలు

జీఓ నెం.14ను రద్దు చేయాలి

జనగణనలో ఓబీసీ కులాలకు ప్రత్యేక కోడ్‌ కేటాయించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

A separate code should be assigned to OBC castes in the census: Former Minister Srinivas Goud

A separate code should be assigned to OBC castes in the census: Former Minister Srinivas Goud
A separate code should be assigned to OBC castes in the census: Former Minister Srinivas Goud

హైదరాబాద్‌: బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్వహణ, కార్యకలాపాలపై సంబంధిత కుల సంఘాల ట్రస్టులకే పూర్తి అధికారాలు కల్పించాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ భవనాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించి, జీఓ నెం.14ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా జనగణనలో ఓబీసీ కులాలకు ప్రత్యేక యూనిక్‌ కోడ్‌ కేటాయించి కులగణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మగౌరవ భవనాలపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్‌ పురుషోత్తం పటేల్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు 42 బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల కోసం 82 ఎకరాల భూమిని కేటాయించిందని, నిర్మాణాల కోసం రూ.95.25 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. పూర్తయిన భవనాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, మిగిలిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అదనంగా రూ.95 కోట్ల నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.

భవనాల నిర్వహణ, సమావేశాలు, ఇతర కార్యకలాపాల విషయంలో కుల సంఘాల ట్రస్టులకు స్వతంత్ర నిర్ణయాధికారం కల్పించాలని అన్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పారదర్శకమైన ట్రస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. అవకతవకలు జరిగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప, సంఘాల హక్కులను హరించకూడదన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయమైన వాటా దక్కాలంటే శాస్త్రీయమైన కులగణన అవసరమని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవ భవనాల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపకూడదని, జీఓ నెం.14ను రద్దు చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

సమావేశ అధ్యక్షుడు సర్దార్‌ పురుషోత్తం పటేల్‌ మాట్లాడుతూ బీసీ కుల సంఘాల హక్కుల పరిరక్షణకు ఐక్య కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. కుల సంఘాల ట్రస్టులపై ప్రభుత్వ పెత్తనం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

ఈ సమావేశంలో మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు కిషోర్‌, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్‌, రాంబాబు యాదవ్‌, వేముల రామకృష్ణ, సుర్వీ యాదయ్య, ప్రణీల్‌ చందర్‌, కుమార్‌ గౌడ్‌, చెన్నయ్య, కృష్ణయ్య గౌడ్‌, నర్సింహా గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular