బాలికల క్రికెట్ జట్టుకు బండి సంజయ్ అండ
ఢిల్లీలో చిక్కుకున్న 17 మంది క్రీడాకారిణులకు తక్షణ ప్రయాణ ఏర్పాట్లు
Bandi Sanjay extends support to girls’ cricket team
కరీంనగర్: జాతీయ స్థాయి అండర్-19 బాలికల క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ జట్టుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు. ఢిల్లీలో ప్రయాణ ఇబ్బందులతో చిక్కుకున్న 17 మంది క్రీడాకారిణులకు ఆయన చొరవతో ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేయడంతో సురక్షితంగా జమ్మూ కాశ్మీర్‌కు చేరుకున్నారు.
జాతీయ స్థాయి పోటీల కోసం తెలంగాణ నుంచి బయలుదేరిన బాలికల బృందానికి ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్లే క్రమంలో అనివార్య కారణాలతో ప్రయాణ సమస్యలు ఎదురయ్యాయి. ఈ విషయం కరీంనగర్ బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు వేముల అనిల్ కుమార్ ద్వారా కేంద్ర మంత్రి దృష్టికి చేరింది.
వెంటనే స్పందించిన బండి సంజయ్ సంబంధిత అధికారులతో మాట్లాడి క్రీడాకారిణులకు ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేయించారు. దీంతో జట్టు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. తమకు సహాయం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు వేముల అనిల్ కుమార్‌కు క్రీడాకారిణులు, కోచ్‌లు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.




