జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి: డా. గడల శ్రీనివాసరావు

- Advertisement -

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి: డా. గడల శ్రీనివాసరావు

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట TUWJ-TJF ధర్నాకు జనసేన మద్దతు.. సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం

ఖమ్మం, నవంబర్ 16:

House sites should be allotted to journalists: Dr. Gadala Srinivasa Rao

ఖమ్మం జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. గడల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TUWJ-TJF ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జర్నలిస్టులతో కలిసి నిరసనలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డా. గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ, సమాజానికి సేవలందించే జర్నలిస్టుల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఖమ్మం నగర పరిసర ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు మెరుగైన వైద్య సదుపాయాలతో కూడిన హెల్త్ కార్డులు అందించాలని, అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల న్యాయమైన హక్కుల సాధనకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ సమస్యలను జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో TUWJ-TJF జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్టులతో పాటు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మిరియాల రామకృష్ణ, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ రాము యాదవ్, జిల్లా నాయకులు కోటి అప్పారావు, బండారు రామకృష్ణ, యాసంనేని అజయ్ కృష్ణ, తుడుం ఉత్తమ్ రాజ్, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, శివరాత్రి రమణ కుమార్, పులి రాజేష్, పూరేటి నరేష్, లింగాల పుల్లారావు, సాయి క్రాంత్, బానోతు దేవేందర్, పిట్టల కళ్యాణ్, పాషా, హనుమంత్, మౌనిక, మైలవరపు మణికంఠ, అక్షయ రెడ్డి, తులసీరామ్, బూసి నాగేశ్వరరావు, మల్లయ్య తదితరులు పాల్గొని జర్నలిస్టుల డిమాండ్లకు సంఘీభావం తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular