- Advertisement -
By ఆముదాల వెంకన్న
బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన సీపీఐ మండల కార్యవర్గ సభ్యుడు ఏనుగు రవికుమార్ (45) మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికకాయంపై సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, ఏనుగు గాంధీ పార్టీ జెండా కప్పి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి మాజీ ఎంపీటీసీ కొంగర రామారావు, కొంగర కృష్ణయ్య, ఏలూరి రమేష్, రాఘవరావు, ఏనుగు కృష్ణయ్య, బొమ్మినేని కొండలరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




