- Advertisement -
By CHIRANJI THIRUPATHI
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రతతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు.శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రతను గమనించిన ఆయన బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆసుపత్రిలోనే పరిశుభ్రత పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు.
- Advertisement -




