- Advertisement -
By MOHAMMAD
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ పాండు గురువారం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శాలువా, పూలమాలలతో సన్మానించారు.
ఆయన వెంట తహసీల్దార్ బాసున్, డిప్యూటీ తహసీల్దార్ రాజు ఉన్నారు.
- Advertisement -




