- Advertisement -
By ఆముదాల వెంకన్న
డిసెంబర్ 7న జరిగే ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఛలో పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జాతీయ సమితి సభ్యులు నానబాల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఖమ్మం గిరి ప్రసాద్ భవన్‌లో ఛలో ఢిల్లీ పోస్టర్లను జిల్లా నాయకులు ఆవిష్కరించారు. యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు, నూతన విద్యా విధానం రద్దు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిలిపివేత, జ్ఞానేష్ కుమార్ తొలగింపు తదితర డిమాండ్లతో మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు లక్షలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.జిల్లా నాయకులు పాల్గొన్నారు
- Advertisement -




