బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కు  ఘన స్వాగతం

- Advertisement -

రానున్న ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పేర్కొంది. హాంగ్జౌ ఆసియాగేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన నిఖత్‌ హైదరాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్‌ విమానాశ్రయంలో నిఖత్‌కు క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్‌ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి బాక్సర్‌గా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది.సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహకారం మరువలేనిదని,ప్రభుత్వ సహకారంతో భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తానని,వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో కచ్చితంగా గెలిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular