Sunday, September 8, 2024

బొగ్గు కార్మికులకు బంపర్ ఆఫర్

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 9: బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించింది కోల్ ఇండియా. ఒక్కొక్క కార్మికుడికి 85వేల రూపాయల చొప్పున బోనస్‌ అందించాలని నిర్ణయించింది.  కోల్‌ ఇండియా  పరిధిలోని సుమారు మూడున్నర లక్షల మంది కార్మికులకు ఈ బోనస్‌ అందనుంది. కోల్ ఇండియా కార్యాలయంలో యాజమాన్యం… కార్మిక సంఘాలతో సమావేశం  నిర్వహించింది. ఈ సమావేశంలో 2022-2023లో ఇచ్చే దీపావళి బోనస్‌పై నిర్ణయం తీసుకుంది. ఈసారి లక్ష రూపాయల బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.  అయితే… 85వేల రూపాయల బోనస్‌ చెల్లింపునకు ఏకాభిప్రాయం కుదిరింది. సిసిఎల్‌కు చెందిన 33 వేల మంది, బిసిసిఎల్‌కు చెందిన 36 వేల మంది కార్మికులు, కోల్  ఇండియా అసోసియేట్ కంపెనీలకు చెందిన మొత్తం 2లక్షల 23వేల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. ఒక్కో కార్మికుడికి 85వేల రూపాయలు దీపావళి బోనస్‌గా  లభించనుంది.

బొగ్గు గని కార్మికులకు ఏటా దీపావళి బోనస్‌ ఇస్తారు. అయితే… గత ఏడాది కంటే ఈ దీపావళికి బోనస్‌ను కాస్త ఎక్కువగానే ప్రకటించింది కోల్‌ ఇండియా యాజమాన్యం.  గతేడాది బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్‌గా 76వేల 500 రూపాయలు చెల్లించగా… ఈసారి 8వేల 500 రూపాయలు పెంచి 85వేలు చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది  కోల్‌ ఇండియా యాజమాన్యం. సింగరేణి కార్మికులకు… ఈ బోనస్‌ డబ్బులు దీపావళికి వారం, పది రోజుల ముందు అకౌంట్లలో జమ చేస్తారు. మిగిలిన ప్రాంతాల వారికి మాత్రం  దసరా ముందే చెల్లించనుంది కోల్‌ ఇండియా యాజమాన్యం.

A bumper offer for coal workers
A bumper offer for coal workers

2022-23 ఆర్థిక సంవత్సరం లాభాల ఆధారంగా బొగ్గు కార్మికులకు బోనస్‌ ప్రకటిస్తారు. కోల్ ఇండియా 2022-23లో 28వేల 125 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే బీసీసీఎల్, సీసీఎల్, ఈసీఎల్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. దీంతో బోనస్‌ భారీగానే ప్రకటించారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా బోనస్‌ ఇచ్చేలా కృషిచేస్తామని తెలిపింది కోల్‌ ఇండియా యాజమాన్యం. కార్మిక సంఘాలు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఏ ప్రభుత్వ రంగంలోనూ చెల్లించని విధంగా… కోల్‌ ఇండియా పెద్ద మొత్తంలో బోనస్‌ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.

2010 నుంచి ఇచ్చిన బోనస్‌ వివరాలు

2010 – 17,000

2011 – 21,000

2012 – 26,000

2013 – 31,500

2014 – 40,000

2015 – 48,500

2016 – 54,000

2017 – 57,000

2018 – 60,500

2019 – 64,700

2020 – 68,500

2021 – 72,500

2022- 76,500

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్