- Advertisement -
వీడని పాప అదృశ్యం కేసు
A case of the disappearance of a child
కరీంనగర్
వేములవాడ లో గత నెల 23న అదృశ్యమైన చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఐదుగురు సభ్యులు గల మహిళలు పాపను తీసుకెళ్ళిన విజువల్స్ సిసి కెమెరా లో రికార్డు అయింది. పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్ ని విడుదల చేసారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి కి చెందిన మతిస్థిమితం సరిగా లేని తల్లి లాస్య నాలుగేళ్ల కూతురు అద్విత తో 23న వేములవాడ కు వచ్చింది. మతిస్థిమితం సరిగా లేకపోవడం పాప గురించి తల్లి చెప్పలేక పోయింది. పాప కుటుంబ సభ్యులు ఆలస్యంగా పోలీసులకు డిసెంబర్ 30న పిర్యాదు చేసారు. అప్పటి నుంచి వెతికినా ఆచూకీ లభించలేదు. సిసి ఫుటేజీల ఆధారంగా అనుమానిత మహిళల చిత్రాలను సోలీసులు విడుదల చేసారు. మూడు పోలీసు బృందాలు పాపకోసం గాలిస్తున్నాయి.
- Advertisement -