- Advertisement -
కోర్టులపై నమ్మకం వుంది
There is faith in the courts
కరీంనగర్
మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ ను బొంద పెట్టాలనే కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అధికారం ఉందని ఎన్ని కేసులు అయినా పెట్టొచ్చన్నారు.న్యాయస్థానంపై నమ్మకం ఉందని, కేటీఆర్ కడిగిన ముత్యాల బయటకు వస్తారని స్పష్టం చేశారు.
కరీంనగర్ లో మేయర్ సునీల్ రావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వేధింపులు చిన్నప్పటి నుంచి చూస్తున్నామని చెప్పారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ఏ వ్యక్తి కేసులకు భయపడరు.. పారిపోరని తెలిపారు. టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం…ఆరోజు భయపడి పారిపోతే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ రక్తంలో భయం లేదని, తెలంగాణ కోసం ఎలా పోరాడామో.. ప్రజల రక్షణ, తెలంగాణ అభివృద్ధి కోసం అలానే పోరాడుతామన్నారు. కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల భూమి కేటాయించామని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని కలిస్తే సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పనులు వెంటనే ప్రారంభించాలని కమలాకర్ కోరారు.
- Advertisement -