నేటి నుండి ఒక టికెట్ పై ఇద్దరికి సినిమా చూసే ఛాన్స్
హైదరాబాద్:, ప్రతినిధి
హైదరాబాద్:నవంబర్ 06
చలనచిత్ర రంగంలో గొప్ప సువర్ణ అవకాశం కల్పిస్తున్న సుముఖ క్రియేషన్స్ సంస్థ రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్‌గా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నరకాసుర సినిమా. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నరకాసుర’ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్‌లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు నరకాసుర‘ మూవీ టీమ్ సభ్యులు. సోమవారం నుంచి ఈ సినిమాను థియేటర్స్‌లో ఒక టికెట్‌పై ఇద్దరు ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ నరకాసుర’ సినిమాకు థియేటర్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రక్షిత్ బాగా నటించాడు,
ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి ప్రశంసలతో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి.
మా సినిమాలో సందేశం మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి గురువారం వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం. నరకాసుర’ వంటి మంచి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలని ఆశిస్తున్నాం ’ అని అన్నారు..