మోసం చేసిన మంత్రిపై చీటింగ్‌ కేసు పెట్టాలి

- Advertisement -

మోసం చేసిన మంత్రిపై చీటింగ్‌ కేసు పెట్టాలి

A cheating case should be filed against the cheating minister

-ముత్తారం వేదికగా ఇచ్చిన బెల్ట్‌షాప్‌ల మాట ఏమైంది

-ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని
మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన మంత్రి శ్రీధర్‌బాబుపై 420చీటింగ్‌ కేసు నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హమీలన్నీ నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చే ఏడాదైనా ఒక్క హమీని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో బాగంగా ముత్తారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బెల్ట్‌షాప్‌లను తొలగించాలనే మహిళల అభ్యర్ధన మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తమ అధిష్టానానికి ఈ విషయం చెప్పి బెల్ట్‌షాప్‌లు లేకుండా చేస్తామని ముత్తారం వేదికగా మహిళలకు ఇచ్చిన వాగ్దానం ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. గత 40ఏండ్లుగా ఒకే కుటుంబానికి ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే ఏం అభివృధ్ది పనులు చేశారో, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఎంత అభివృధ్ది జరిగిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తాము ప్రభుత్వ పనితీరును వైఫల్యాలను ప్రశ్నిస్తే కింది స్థాయి నాయకులతో దూషించేలా మాట్లాడించడం, తన సామాజిక వర్గ నాయకులతోనే తనపై దాడులు చేయించడం సరికాదని, మంథని అభివృధ్దిపై ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చిన్నకాళేశ్వరం పూర్తి చేస్తామని మాట్లాడిన మంత్రి ఆనాడు ఎమ్మెల్యేగా ఇరిగేషన్‌ అధికారులతో సాధారణంగానే రివ్యూచేశానని, ఆ ప్రాజెక్టు పేరుతోనే తాము అధికారంలోకి వస్తామని మాట్లాడలేదా అని ఆయన ప్రశ్నించారు. ఓడేడు వంతెనపై ఆనాడు ప్రభుత్వంపై నిందెలు మోపిన మంత్రి ఈనాడు తమ ప్రభుత్వం అధికారంలోనే ఉంది కదా ఇప్పుడు ఒడేడ్‌ బ్రిడ్జి ఎందుకుపూర్తిచేయించడం లేదన్నారు. అలాగే కిషన్‌రావుపల్లి నుంచి భూపాలపల్లి వరకు రహదారి నిర్మాణం కోసం కేవలం రూ.4కోట్ల నిధులు మంజూరీచేయలేకపోతున్నారని, ఈ రహదారి నిర్మాణంతో భూపాలపల్లి వెళ్లేందుకు దూరభారం తగ్గుతుందని ఆయన వివరించారు. ఏడాది కాలంలో అనేకం చేస్తామని మభ్యపెట్టి ఒక్క అభివృద్ది పనిచేయాలని అసమర్ధుడు మంథని ఎమ్మెల్యే అని ఆయన విమర్శించారు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన మంత్రి శ్రీధర్‌బాబుపై 420కేసు నమోదు చేయాలని పోలీసులకు రిజిష్ట్రర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు చేయడం జరుగుతుందని పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఈ పాత్రికేయల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు యెగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్, ఆరేపల్లి కుమార్, మాచిడి రాజు గౌడ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular