Sunday, September 8, 2024

ఈ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డనే…. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా

- Advertisement -

అభివృద్ది,సంక్షేమం,సేవ నా ప్రధాన ఏజెండాలు
-బీసీ బిడ్డగా నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నా
-వేయి కోట్లతో మంథని రూపురేఖలు మార్చేలా కృషి చేస్తా
-బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని: ఈ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు. బుధవారం మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్‌ పత్రాలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మూడోసారి, మామూలు కుటుంబంలో పుట్టిన బీసీబిడ్డగా నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తున్నానని అన్నారు. మంథని నియోజకవర్గం అభివృధ్దిలో పరుగులుపెట్టాలంటే ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఇప్పటికే తాను ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృధ్దితో పాటు తన తల్లిపేరున స్థాపించిన ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించానన్నారు. సంక్షేమ, అభివృద్ది, సేవ నా ప్రధాన ఏజేండాలని ఆయన అన్నారు. తొమ్మిదేండ్లుగా మంథని నియోజకవర్గాన్ని తన కుటుంబంగా బావించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్దే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని అన్నారు. బీసీ బిడ్డగా నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్తిగా బరిలో నిల్చున్నానని, ప్రజలు ఆశీర్వదించాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టోలో పొందుపర్చిన ప్రతి పథకం గొప్పవని, కేసీఆర్‌ బీమా, ఫించన్‌ల పెంపు, సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతి మహిళకు రూ.3వేలు, ఇలా ఇంకా అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని, ఈ పథకాలతో పాటు తన సొంతంగా సేవలు అందిస్తామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది పేద బిడ్డలు ఉన్నత చదువులు చదువుకునే ఆరాటం ఉన్నా అవకాశం లేక చదువుకు దూరం అవుతున్నారని, అలాంటి వారికి హైదరాబాద్‌లో రెండు హస్టల్‌లు ఏర్పాటు చేసి పైసా ఖర్చు లేకుండా పై చదువులు చదివించే బాధ్యత తీసుకుంటానన్నారు. అంతేకాకుండా ఆడబిడ్డలకు గతంలో సామూహిక వివాహలు జరిపించినట్లుగానే మంథని, కాటారంలలో ఆడబిడ్డకు మేనమామనై వివాహం జరిపిస్తానన్నారు. గృహలక్ష్మిపథకం ద్వారా ఇళ్లు మంజూరీ చేయించి ఆ ఇంటి నిర్మాణంలో కొంత సాయం చేసి దగ్గరుండి పూర్తి చేయించి గృహ ప్రవేశం చేయిస్తానని ఆయనహమీ ఇచ్చారు. మంథని నియోజకవర్గ అభివృధ్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేయి కోట్లు ప్రకటించారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేయికోట్లతో మంథని రూపు రేఖలు మార్చుతానన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ ఏర్పాటు చేయిస్తానని, మంథని మండలం ఆరెంద మానేరుపై బ్రిడ్జి నిర్మాణంతో పాటు అనేక సమస్యలు తీర్చుతానని ఆయన అన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, బీసీ బిడ్డగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలు ఆలోచన చేసి ఆదరించాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. కేవలం రాజకీయంగా ఎదిగినోళ్లను, ప్రతిపక్షాలను రాజకీయ సమాధి చేయడంలో మాత్రమే రికార్డు కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత అభివృధ్దిని పేదోళ్లకు తనవంతుగా సేవ చేసి చూపించానని ఆయన గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లకు అవకాశం ఇస్తె ఎలా అభివృధ్ది చేస్తారో మీరే చూశారని, అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే కనబడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ సభ సక్సెస్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి మరువలేనిదని, సమిష్టిగా ప్రజలను తరలించడంలో ఎంతో కష్టపడ్డారని ఆయన కొనియాడారు.నియోజకవర్గ ప్రజలు సైతం బీసీ బిడ్డను కాపాడుకోవాలని బారీగా తరలివచ్చి ఒక మంచి సందేశం ఇచ్చారని, అంచనాకు మంచి ప్రజలు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్