
A criminal case should be registered against the rice millers who did not give CMR
అక్రమ మైనింగ్ అరికట్టాలి
కెసిఆర్ అసమర్ధత తోనే సీలేరు ప్రాజెక్ట్ కోల్పోయాం
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపం పై కెసిఆర్ నైతిక బాధ్యత వహించాలి
-విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా బ్యూరో (డిసెంబర్ 19,23)వాయిస్ టుడే :జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ,
ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జువ్వాడి నర్సింగారావు తో కలిసి
పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుంది అని తెలిసి కూడా తెలంగాణ యువత ఆత్మ బలిదానాలు ఆపాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం ఆర్థిక భరోసా లభిస్తుంది.ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం యాజమాన్య బాధ్యత తీసుకొని ప్రొవిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పిస్తాం.వాహన ఫిట్నెస్ పన్నులు, ఇతర పన్నులు భారం తగ్గించి, ఆటో కార్మికులను ఆదుకునేందుకు కృషి చేస్తాం.తెలంగాణలో టీ ఆర్ ఎస్ ను 11 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్ర అధినేతగా బిజెపి బిల్లులు అన్నింటినీ సమర్థించారు.తెలంగాణ లోని ఏడు మండలాలు ఆంధ్రలో విలీనం పై బిజెపి మెడలు ఎందుకు వంచలేదు.తెలంగాణ హక్కులు కాపాడలేక పోవడం మీ అసమర్ధత కాదా అని నిలదీశారు.తెలంగాణలోని 7 మండలాలు ఆంధ్రలో విలీనం చేస్తే ఎందుకు అడ్డుకోలేదు.మే అసమర్ధత వల్లే సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోల్పోయినం.వినోద్ కుమార్ వాస్తవాలు గ్రహించాలి.రైస్ మిల్లర్లు సీ ఎం ఆర్ బియ్యం అమ్మేసుకున్నారు.రైస్ మిల్లర్ల నుండి రికవరీ తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలి.రేషన్ షాపు లో నిల్వలు లేవని కేసు నమోదు చేస్తున్నారు.రైస్ మిల్లర్ల లైసెన్స్ ఎందుకు రద్దు చేయలేదు అని గత ప్రభుత్వాన్ని
నిలదీశారు.20 వేల కోట్ల విలువైన దాన్యం ఏ విధమైన రక్షణ లేకుండా రైస్ మిల్లర్లకు ధాన్యం అప్పగించారు.రైస్ మిల్లు ఏర్పాటుకు అయ్యే పెట్టుబడి అంత ధాన్యం రైస్ మిల్లర్లు అమ్ముకున్నారని ఆరోపించారు.మిల్లులు తనిఖీ చేసి, చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామని అన్నారు.అక్రమంగా ఇసుక తవ్వుతున్న వారి పై చర్యలు చేపట్టాలన్నారు.అక్రమంగా గుట్టలను తవ్వెస్తున్నరు. అక్రమ మైనింగ్ ను అడ్డుకొని, చర్యలు తీసుకోవాలి.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపం పై కెసిఆర్ నైతిక బాధ్యత వహించాలి.ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నియోజక వర్గ అభివృద్ధి తనతో సాధ్యమనే నమ్మకం తో ప్రజలు గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి.కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు అమలు చేస్తాం.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం.ఆరోగ్యశ్రీ పుర్తి స్థాయిలో అమలు చేసేలా కృషి చేస్తాం.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందజేస్తాం.ప్రభుత్వ విప్పు ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఈ సందర్భంగా మాట్లాడారు.