బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘టైగర్ 3’. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న స్పై యూనివర్స్లో తొలి మహిళా స్పైగా నటించి మెప్పించింది కత్రినా కైఫ్ మరోసారి టైగర్ 3 చిత్రంలో వామ్మో అనేలా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. టర్కీ హమామ్‌లో కత్రినా కైఫ్‌పై చిత్రీకరించిన టవల్ ఫైట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. హీరో మాత్రమే చేసే ఫైట్ సీక్వెన్స్‌లో ఓ హీరోయిన్ ఎంత గొప్పగా నటించగలదో కత్రినా ఇందులో చూపించారు.
ఈ సందర్భంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ ‘‘అందరూ మెచ్చుకునేలా రిస్క్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో నటించటాన్ని నేనెంతో ఇష్టపడి కష్టపడి చేశాను. టైగర్ ఫ్రాంచైజీ చిత్రాల్లో నాకు మరచిపోలేని గొప్ప అనుభూతులున్నాయి. ఓ యాక్షన్ హీరోయిన్‌గా అవి నన్నెంతో గొప్పగా ఆవిష్కరించాయి. ఈ ఫ్రాంచైజీలో జోయా అనే స్పైగా నటించారు. జోయా ఓ ఫైటర్‌గా ఇందులో కనిపిస్తుంది. టైగర్‌లాగానే ఆమె ఎవరినైనా ఎదిరించటమే కాదు, తుది వరకు నిలబడి పోరాడుతుంది. అందుకనే ఆ పాత్రలో నటించటానికి నేనెప్పుడూ ఎగ్జయిట్ అవుతుంటాను. ఈ పాత్రను పురుషులతో సమానంగా పోరాడే ఓ మహిళను ఆడియెన్స్ చూస్తారు. ఇక హమామ్‌లో చిత్రీకరించిన టవల్ ఫైట్ ఇంటర్నెట్‌లో ఎంతో వైరల్ అయ్యింది. అయితే ఆఫైట్‌ను ఎంతో కష్టపడి చిత్రకరించాం. ఎందుకంటే ఆవిరులతో నిండిన గదిలో పోటాపోటీగా సాగే ఫైట్ ఇది.
దీన్ని గ్రిప్పింగ్ కిక్స్, పంచ్‌లతో చేయటం ఎంతో కష్టంతో కూడుకున్నది. ఇద్దరు మహిళలు ఇలా నువ్వా నేనా అనేంతగా పోరాడే ఫైట్ సీన్ ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై రాలేదు. ఇలాంటి ఆలోచన చేసిన ఆదికి ధన్యవాదాలు. డైరెక్టర్ మనీష్, యాక్షన్ టీమ్ ఈ ఫైట్ సీన్‌ను ప్లానింగ్‌తో చిత్రీకరించిన విధానానికి హ్యాట్సాఫ్. ఇదొక టీమ్ ఎఫ్టర్. చూసే వారందరికీ నచ్చుతుంది. ఇందులో టవల్ ఫైట్‌లోనాతో మిచెల్ లీ నటించారు. మా మధ్య జరిగే ఈ ఫైట్ సీన్ మెప్పిస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు చాలా మంది మహిళలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై యాక్షన్ సీక్వెన్స్‌లో నటించారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే బెస్ట్‌గా నిలిచాయి. అలాంటి బెస్ట్ ఫైట్స్‌లో ఇదొకటిగా నిలుస్తుంది. దీనికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన టైగర్ 3 చిత్రంలో ఆయన సరసన జోయా పాత్రలో కత్రినా కైఫ్ నటించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ మూవీని మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది