ఫర్నిచర్, ఫైళ్లు, కార్లు దగ్దం
హైదరాబాద్: హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మంటలు చేలరేగాయి. భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్ , ఫర్నిచర్ , కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదే విధంగా మంటలు చెలరేగినప్పుడు కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్ల పై అగ్ని కీలలు పడటంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇటీవల ఎన్నికల కోడ్ ఉల్లఘించిన పర్యాటక శాఖ ఎండీ మనోహర్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోన్నాయి