Sunday, September 8, 2024

ప్రజలపై భారం పడకుండా పనిచేస్తున్న ప్రభుత్వం

- Advertisement -

ప్రజలపై భారం పడకుండా పనిచేస్తున్న ప్రభుత్వం
అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించిన ఎమ్మెల్యే అఖిలప్రియ
అఖిలమ్మ తోనే ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం
ఆళ్లగడ్డ:

A government that works without burdening the people

నిత్యవసర వస్తువుల ధరల స్థిరీకరణ లక్ష్యంగాప్రజలపై భారం పడకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తుందని  టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కోలేగుండ్ల నరసింహుడు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్టీ సెల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీమతి భూమ అఖిలప్రియ తోనే సాధ్యమన్నారు. అభివృద్ధి సంక్షేమపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టి సారించారని తెలిపారు.   పేద ప్రజలకు కందిపప్పు బియ్యం ధరలను తగ్గించి అమ్మాలనే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాలతో ఆళ్లగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పౌర సరఫరాల శాఖ బియ్యం కందిబేళ్ల ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారన్నారు. కావున ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక  సంక్షోభాన్ని తట్టుకుంటూనే… ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క హామీని టిడిపి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆళ్లగడ్డ శాసనసభ్యులు శ్రీమతిభూమా అఖిలప్రియ నాయకత్వంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. వికలాంగులకు వయోవృద్ధులకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచారని సంతోషం వ్యక్తం చేశారు.  ఆగస్టు 15 తారీకు నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల పథకాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి కార్యకర్తలు కండ్రై శివకృష్ణ , రాము, జయరాముడు ,నాసారి కాశయ్య ,భనేటి సతీష్, పెనుబండి రమణమ్మ, కళింగిరి వివేక్ తదితరులు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్