తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ మున్నూరుకాపు నాయకుల బృందం

- Advertisement -

తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ మున్నూరుకాపు నాయకుల బృందం
వాయిస్ టుడే : హైదరాబాద్

A group of Telangana Congress Munnurkapu leaders met Telangana in-charge Meenakshi Natarajan.
తెలంగాణ క్యాబినెట్‌లో మున్నూరుకాపు సామాజికవర్గానికి మంత్రి పదవి కల్పించాలనే డిమాండ్‌తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్నూరుకాపు నాయకుల బృందం, ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా మున్నూరుకాపు సామాజికవర్గానికి తెలంగాణ క్యాబినెట్‌లో స్థానం కల్పించని పరిస్థితి ఏర్పడిందని, ఇది సమాజంలో తీవ్ర చర్చకు దారి తీస్తోందని ఏఐసిసి నేత రుద్ర సంతోష్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కి విన్నవించారు

కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల కాలం నుంచి ఇప్పటివరకు మున్నూరుకాపు సమాజం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి, ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించిందని నాయకులు గుర్తు చేశారు. జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు సమాజానికి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించడం సామాజిక న్యాయం దిశగా కీలక అడుగుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై స్పందించిన ఏఐసిసి ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మున్నూరుకాపు నాయకుల విన్నపాన్ని సానుకూలంగా స్వీకరిస్తూ, ఈ డిమాండ్‌ను తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పార్టీ పరంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.

అలాగే, రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలసి ఈ డిమాండ్‌ను నేరుగా తెలియజేయనున్నట్లు నాయకులు వెల్లడించారు. మున్నూరుకాపు సమాజానికి రాజకీయంగా తగిన గుర్తింపు కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో  టిపిసిసి ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, గాలి అనిల్ కుమార్, గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శులు ఈవి శ్రీనివాస్, రాంభూపాల్, ఈర్ల కొమురయ్య, బొమ్మ శ్రీరామ్, ప్రవీణ్, రాజేశ్వర్, అల్లం భాస్కర్, తూము వినయ్ తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular