బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ లో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్దే హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుంది : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 31) : ఈరోజు షాపూర్ నగర్ లోని ఎం జి ఎస్ గార్డెన్ లో 129- సూరారం డివిజన్ ప్రజా ఆశీర్వాద సభ భారీఎత్తున నిర్వహించారు. ఈ సభకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మేధాశక్తి, చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను వెనక్కునెట్టి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. 75 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడం చేతకాని బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఇది చేపడతాం, అది చేస్తామని చెప్పడం, సంక్రాంతి పండుగలకు వచ్చే గంగిరెద్దుల వలె ఎన్నికలప్పుడు ఇళ్ల ముందుకు వచ్చి చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ప్రతిపక్షాల వారంటీ లేని గ్యారెంటీలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు భూస్థాపితం అవ్వడం ఖాయమన్నారు. కుత్బుల్లాపూర్ లో చేపట్టిన అభివృద్ధిని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రూపొందించిన మేనిఫెస్టోను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి టిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని చేకూర్చాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం 129 – సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు, పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అలీం ఖాన్, 129 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సలహాదారులు ఇక్బాల్ గార్లతో పాటు వారి మిత్ర బృందంలోని 500 మంది సభ్యులు పార్టీలో చేరారు, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, యూత్ అధ్యక్షులు దొడ్ల శ్రీను, నాయకులు డాక్టర్ హుస్సేన్, ఫిరోజ్, మధు, సంక్షేమ సంఘం అధ్యక్షులు బషీరుద్దీన్, చెక్క సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, విట్టల్, గండయ్య, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



