యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన నరేంద్ర మోడీ
మద్యంతో తెలంగాణ ప్రజల భవిష్యత్తు చిత్తు
మార్నింగ్ వాకర్స్ తో బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి
యదాద్రి భువనగిరి నవంబర్ 7: ఆరోగ్య తెలంగాణ సాధ్యం కావాలి అంటే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావాలని భువనగిరి బిజెపి అభ్యర్థి, గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. ఈరోజు భువనగిరి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ స్థానిక చెరువు కట్ట వద్ద మార్నింగ్ వాకర్స్ తో కలిసి ఇష్ట గోష్టిగా మాట్లాడుతూ, ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం వాకింగ్ యోగా లాంటి సాధనాల ద్వారానే సాధ్యమవుతుందని, ఆరోగ్యం పట్ల అవగాహనతో ప్రతినిత్యం వాకింగ్ లో కలుసుకుంటున్న భువనగిరి మిత్రులను ఆయన అభినందించారు. కమిషన్లకు కక్కుర్తి పడిన చంద్రశేఖర రావు ప్రభుత్వం పదేళ్ల నుండి మద్యంపై వచ్చే ఆదాయం పైనే దృష్టి సారించిందని తెలంగాణను ముఖ్యంగా యువతను తాగుబోతులుగా తయారుచేసి వారి లో చైతన్యాన్ని లేకుండా చేసిందనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసలు అయిన యువత అతిపిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారని కుటుంబాలు నాశనం అవుతున్నాయని అయినా కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం మద్యంపై మరింత ఆదాయాన్ని పెంచే దిశగానే ఆలోచనలు చేస్తుందని ఆయన విమర్శించారు
జాతి సంపదైనా మానవ వనరులను కాపాడుకోవాలంటే అందరికీ ఆరోగ్యం ఎంతో అవసరం అని దీనిని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితిలో 126 దేశాలను ఒప్పించి యోగా కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకోవచ్చారని అటువంటి విజినరీ లీడర్షిప్ రాష్ట్రంలో కూడా ఎంతో అవసరం ఉందని అన్నారు.గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వేల పార్కులు నిర్మించబడ్డాయని సంపూర్ణ మధ్య నిషేధం అమల్లో ఉన్న ఆ రాష్ట్రంలో ప్రతిరోజు విద్యార్థులు యువకులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఆయా పార్కులలో వాకింగ్, యోగా, ధ్యానం వంటివి సాధన చేస్తుంటారని అటువంటి సంస్కృతి తెలంగాణలో కూడా రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తనను భువనగిరి శాసనసభ్యునిగా ఎన్నుకుంటే గూడూరు ఫౌండేషన్ ద్వారా నిరంతరం ఆరోగ్య అవగాహన శిబిరాలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు, రత్నపురం శ్రీశైలం కందారి శ్రీధర్ కొల్లోజు సతీష్ బెండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



