మరో ఆడపిల్ల వద్దని భార్యను హతమార్చిన భర్త

- Advertisement -

మరో ఆడపిల్ల వద్దని భార్యను హతమార్చిన భర్త

A husband who killed another girl childless wife

ప్రత్యక్ష సాక్షి కూతురును మట్టుబెట్టిన నిందితుడు
కర్నూలు
తన భార్య నిండు గర్బిణీ. తొమ్మిదినెలలు నిండాయి. ఇంకేముందీ మళ్లీ ఆడపిల్లనే కనబోతోందని ఓ మృగాడు రాక్షసుడిగా మారిపోయాడు. భార్యను కొట్టి చంపేశాడు. ప్రత్యక్ష సాక్షి కూతురు గొంతు నిలిమి ప్రాణం తీశాడు. ఈ కిరాతక చర్య సభ్య సమాజాన్ని కంట తడిపెట్టించింది. ఈ దారుణం కర్నూలు జిల్లా హోళగుంద మండలం  హెబ్బటంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం వెలుగు చూసిన ఈ అమానుషం వివరాలు ఇవి.  హేబ్బటం గ్రామానికి చెందిన సకరప్ప, సలీమా భార్యాభర్తలు. వీరికి  మూడేళ్ల కుమార్తె సమీరా ఉంది.  ప్రస్తుతం సలీమా గర్భిణి. సలీమాకు  మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమోనని సకరప్ప అనుమానించాడు. నిత్యం ఘర్షణ పడుతున్నాడు. గురువారం రాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా, ఆవేశంతో సకరప్ప  కర్రతో సలీమా తలపై కొట్టి చంపాడు. ఈ అకృత్యానికి ప్రత్యక్ష సాక్షి సమీరా గొంతును నులిమి చంపేశాడు.  పోలీసులకు లొంగిపోయాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular