జర్నలిస్టు అందరి వాడు
– రాహుల్ ను ఆదర్శంగా తీసుకోవాలి
-జర్నలిస్టు రాహుల్ పేరు ప్రస్తావించిన సీఎం రేవంత్ -ప్రెస్‌మీట్‌లో ఇదే హైలైట్!
– నాడు కేసీఆర్… నేడు రేవంత్. పాలకుల్లో మార్పు తేడా ఉంటుంది.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి స్వీకరించబోయే దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ఒకమంత్రులతో కలిసి ఆరు గ్యారెంటీల లోగో విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వరుసగా జర్నలిస్టులు ముఖ్యమంత్రిని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాహుల్ కూడా ఆ ప్రెస్ మీట్ లో ఉన్నాడు. సీఎం రేవంత్ ను ఆయన ఓ ప్రశ్న అడగటానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన సీఎం రేవంత్ ఒక్కసారిగా ‘రాహుల్ చెప్పండి’ అంటూ ముందే సరదాగా అడగటంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొన్నటి దాకా కేసీఆర్ ప్రెస్ మీట్ లో పదే పదే రాహుల్ ను గుర్తు చేసే వారు. ఇప్పుడు సీఎం రేవంత్ కూడా రాహుల్ పేరు ప్రస్తావించారని అక్కడున్న జర్నలిస్టులు ఆశ్చర్య
పోయారు. అంతే కాదు అందరూ హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టు అనేవాడు అందరి వాడు. అది మరిచిపోవద్దు. ప్రభుత్వాలు మారుతున్నా, ముఖ్యమంత్రులు ఎవరొచ్చినా, అధికారులు మారినా, జర్నలిస్టు మాత్రం మారడు. ఎప్పటికీ మర్చిపోలేని జర్నలిస్టుగా, అందరి వాడుగా ఉంటాడు.ఉండాలి కుడా. సీనియర్ జర్నలిస్టు రాహుల్ ఆదర్శంగా ఉండాలని, ఉంటారని కోరుకుందాం.



