- Advertisement -
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం! కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవితను సీబీఐ మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది.
- Advertisement -



