బ్రేకప్ చెప్పినా…వదలని ఉన్మాది

- Advertisement -

బ్రేకప్ చెప్పినా…వదలని ఉన్మాది
హైదరాబాద్, ఆగస్టు 29

A maniac who doesn't give up even if he says break up
A maniac who doesn't give up even if he says break up
A maniac who doesn’t give up even if he says break up

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు.. అయితే.. ఆమెను చంపింది మాజీ ప్రియుడేనని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలో చోటుచేసుకుంది.. అర్ధరాత్రి ప్రియురాలిపై కత్తితో దాడి చేసి ప్రియుడు పరారయ్యాడు.. ఈ క్రమంలో.. అడ్డుకోబోయిన మరో ముగ్గురు యువతులకు కూడా గాయాలయ్యాయి.. ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పింది.. అయినా.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడిన యువకుడు ఆమెను చంపి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటక బీదర్కు చెందిన రాకేశ్ అనే వ్యక్తి మాదాపూర్లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. అతనికి నల్లగండ్లలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ వెస్ట్కు చెందిన దీపన తమాంగ్ అలియాస్ గ్రీష్మ (25)  అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. దీపన తమాంగ్ తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలి గోపన్పల్లి తండాలో నివాసం ఉంటుంది. అయితే.. వారిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు ఏర్పడ్డాయి.. దీంతో రాకేశ్కు దీపన బ్రేకప్ చెప్పింది. అయినా రాకేశ్.. పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వెంట పడుతూ వేధించేవాడు..ఈ క్రమంలోనే బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేశ్.. తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు.. యువతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాకేశ్ కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడి చేశాడు.. ఈ క్రమంలో అతడిని అడ్డుకోవడానికి దీపన ముగ్గురు స్నేహితులు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దీపన అక్కడికక్కడే మృతిచెందగా.. దాడిని అడ్డుకున్న ముగ్గురు యువతులకు గాయాలయ్యాయి. వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చివరకు ఆత్మహత్యాయత్నం..
అయితే.. యువతిపై దాడి అనంతరం రాకేశ్‌ కనకమామిడి వద్ద కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో గాయపడిన రాకేశ్‌కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular