సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ముఖ్య సభ్యుల సమావేశం
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం
జనాభా ప్రతిపాదన మీద అసెంబ్లీ సీట్లు కేటాయించాలి అని, మున్నూరు కాపు సంఘం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని, ఈ రెండు ప్రత్యేకంగా ఎజెండాలతో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం సాయంత్రం మూడు గంటలకు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం చందానగర్ పటాన్చెరువు కార్యవర్గ, కార్యనిర్వాహక సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి తెల్ల హరికృష్ణ పటేల్, కార్యనిర్వాక కార్యదర్శి ఆకుల బాలకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ యూత్ విభాగం అధ్యక్షులు దేశెట్టి శివ హాజరైనారు, ఈ సందర్భంగా డాక్టర్ కుండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నేను మన మున్నూరు కాపు సంఘానికి నా వ్యక్తిగత వ్యాపారాలను, నా కలను పక్కనపెట్టి మన మున్నూరు కాపు సంఘానికి రావలసిన, కావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో నాతో పాటు మన కుల సోదరీ సోదరీమణులు ఎంతోమంది ముందుకు వస్తున్నారు మన అందరి లక్ష్యంలో ఒకటే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం 5000వేల కోట్లతో కేటాయించాలని, మన జనాభా ప్రాతిపాదన అన్ని పార్టీలు మనకు 15 నుంచి 18 సీట్లను కేటాయించాలని లేదా జిల్లాకి ఒక ఎమ్మెల్యే టికెట్ ను అయిన కేటాయించాలని మన డిమాండు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదువేల కోట్ల రూపాయలు ఐదు ఎకరాల భూమితో పాటు మరొక 25 కోట్ల రూపాయలు భవన నిర్మాణా పనులకు పనుల కొరకు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేశారు, తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా డాక్టర్ కొండా దేవయ్య పటేల్ చేస్తున్న ఈ ఉద్యమాన్ని చూసి తెలంగాణ లో ఉన్న అన్ని పార్టీలు మన వారి వైపు చూస్తూ ప్రత్యేక స్థానాలను కేటాయిస్తున్నారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మన వారందరినీ ఏక తాటిపైకి తీసుకువచ్చి నెక్లెస్ రోడ్ జల్వాయి విహార్ లో గొప్పగా ప్లీనరీని నిర్వహించారు, మన రాష్ట్రం వారినే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలను కూడా కలుపుకుంటూ ముందుకు వెళుతూ మున్నూరు కాపు ఐక్యత కొరకు పాటుపడుతున గొప్ప వ్యక్తి మన డాక్టర్ కొండ దేవయ్య పటేల్ అని కొనియాడారు, అదేవిధంగా మన గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న గోషామహల్ టికెట్ ను మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్ వి మహేందర్ పటేల్ కి కేటాయించాలని కోరుతున్నాము.



