- Advertisement -
దేశ రాజధాని మార్చాలంటూ కొత్త డిమాండ్
A new demand to change the capital of the country
తిరువనంతపురం, నవంబర్ 20, (వాయిస్ టుడే)
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఇక్కడ విపరీతంగా కాలుష్యం నమోదవుతోంది. చుట్టుపక్కల పరిశ్రమలు.. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు తమ పంట వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల విపరీతంగా కాలుష్యం నమోదవుతున్నది. దీనికి చలి కూడా తోడు కావడంతో ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. వృద్ధులు, చిన్నారులు శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ వినూత్న డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. ” ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. గాలి పీల్చడానికి అనువుగా లేకుండా పోతుంది. చాలామంది శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ నగరాన్ని కొనసాగించాలా?” అంటూ ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ ఏడాది మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత సూచి ఏకంగా 500 మార్క్ ను చేరుకుంది.. ఈ వాయు కాలుష్యానికి దట్టమైన పొగ మంచు తోడైంది. దీంతో గాలి నాణ్యత అద్వానంగా మారింది. వాయు కాలుష్యం వల్ల ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శశిధరూర్ కేంద్రంపై తీవ్రస్థాయిల విమర్శలు చేశారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నగరాన్ని దేశ రాజధానిగా ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. ” ఢిల్లీ ప్రపంచం లోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఇక్కడ అత్యంత ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ధాకా రెండో స్థానంలో ఉంది. ఆ నగరంతో పోల్చి చూస్తే ఢిల్లీలో ఐదురెట్ల స్థాయిలో ప్రమాదకర కాలుష్యం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇది అత్యంత విడ్డూరంగా ఉంది. నవంబర్ నుంచి జనవరి వరకు ఢిల్లీ నగరంలో నివాసం ఉండడానికి అవకాశం లేకుండా పోతోంది. ఇక మిగతా రోజుల్లోనూ ఇక్కడ జీవన సాగించడం అంతంత మాత్రం గానే ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఢిల్లీని దేశ రాజధానిగా ఎందుకు కొనసాగించాలి” అని శశి థరూర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.ఢిల్లీలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్క్ కు చేరుకుంది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494 కు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. నవంబర్ నెలలో ఇదే అత్యధికమని వారు వివరిస్తున్నారు. కాలుష్యం పెరగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కళ్ళల్లో మంటలు, విపరీతమైన దురద, గొంతులో నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇక రాజధాని ప్రాంతం మొత్తం గాలి పీల్చడానికి అనువుగా లేకుండా పోయింది. దట్టమైన పొగ మంచు నగరాన్ని మొత్తం కమ్మేస్తోంది.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్క్ చూపించడం.. ఇది సివియర్ ప్లస్ కేటగిరీని సూచిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఢిల్లీలో పొగ మంచు, కాలుష్యం పెరిగిపోవడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
- Advertisement -