ఏ.పి.బి.సి. స్టడీ సర్కిల్‌లో మెగా డి.ఎస్.సి. ఉచిత కోచింగ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
A.P.B.C. Mega D.Sc in Study Circle District Collector who started free coachingమెగా డిఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు బి.సి స్టడీ సర్కిల్ తిరుపతి నందు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి,
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల కొరకు పరీక్షకు సన్నద్ధం అవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల కొరకు బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏ.పి.బి.సి. స్టడీ సర్కిల్‌లో మెగా డి.ఎస్.సి. ఉచిత కోచింగ్ ను ప్రారంభించు కోవడం ఎంతో సంతోషంగా ఉందని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్ పేర్కొన్నారు.
శనివారం ఉదయం స్థానిక ఎంఆర్ పల్లి సర్కిల్ సమీపంలో బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏ.పి.బి.సి. స్టడీ సర్కిల్, తిరుపతి నందు మెగా డి.ఎస్.సి. ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ 668 సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి అయిదు సంతకాలలో
మెగా డిఎస్సీ ఫైలుపై ఒకటి అని తెలిపారు. డిఎస్సీ ప్రకటనకు ముందుగా చదువుకున్న బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పిల్లలకు డిఎస్సీ ఉచిత శిక్షణ ద్వారా వారికి తోడ్పాటు అందించడం జరుగుతోందని అన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న డిఎస్సీ అని ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు మరచిపోలేమని పలువురు సంతోషం వ్యక్త పరిచారు. స్టైఫండ్, పుస్తకాలు కూడా శిక్షణ లో భాగంగా అందివ్వనున్నారని, శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కరెంట్ అఫైర్స్ పై, సబ్జెక్ట్ పై పట్టు పెంచుకోవాలని, ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని, కాంపిటీషన్ ఉంటుందని ప్రణాళిక బద్ధంగా ప్రిపేర్ కావాలని అన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ కానున్నదని తెలిపారు. గత టెస్ట్ పేపర్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిపై కూడా ప్రిపేర్ కావాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సీ ద్వారా నియామకం కాబడిన ఉపాధ్యాయులను పాఠశాలల్లో పోస్టింగ్ చేస్తామని మన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారని గుర్తు చేశారు. నేడు బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏ.పి.బి.సి. స్టడీ సర్కిల్‌లో మెగా డి.ఎస్.సి. ఉచిత కోచింగ్ ప్రారంభించు కోవడం ఎంతో సంతోషంగా ఉందని, బి.సి, ఎస్.సి, ఎస్.టి మరియు ఇ.బి.సి/ఈ.డబ్ల్యు.ఎస్ వర్గాలకు చెందిన 220 మంది అర్హులైన విద్యార్థులకు (ఎస్.జి.టి-110, ఎస్.ఏ-110) 60 రోజులపాటు శిక్షణ ఇవ్వబడుతుందని తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని, అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
అనంతరం ఎంఎల్సి సిపాయి సుబ్రమణ్యం, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సదరు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్ర శేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా సహకార అధికారిణి లక్ష్మీ, సహాయ బిసి సంక్షేమ అధికారిణి జ్యోత్స్న, పలువురు బిసి సంక్షేమ శాఖ సిబ్బంది, శిక్షణ ఫ్యాకల్టీ, కోచింగ్ కు హాజరైన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.




