ట్రాక్‌పై అడ్డుగా రైలు పట్టా ముక్క…. రైలుకు తప్పిన ప్రమాదం

- Advertisement -

నర్సాపురం-ధర్మవరం మధ్య

కావలి: నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట రైల్వేస్టేషన్ల మధ్య పెను ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ఈ ప్రమాదం నుంచి బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. కావలి-బిట్రగుంట మధ్య ఎగువమార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్ల రైలు పట్టా ముక్కను ట్రాక్‌పై అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో నర్సాపురం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ అదేమార్గంలో వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ పట్టా ముక్కను రైలు ఢీకొట్టగానే అది దూరంగా పడిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular